అందాల అలలతో అలరించే ఆ అమ్మాయి ఎవరో తెలియదుకాని నాలోని మధురమయిన భావాలన్నీ తనకోసమేనేమోనని అనిపించింది........
నాతో దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు తన ధరహసమే నన్ను ఓడించింది......
నా కళ్ళెదుట ఎవరులేకున్న తనుమత్రమే నాకు కనిపించింది.....
తన హృదయంలో చోటివ్వమని అడిగే ధైర్యం నాకు లేకపోయినా నా హృదయమంత తనే ఉన్నట్లు తనకు తెలిస్తే చాలనిపించింది......
తనకోసం ఎంతవెతికిన కనపడని ఈలోకం నాకు అవసరం లేదనిపించింది..........
ఆఖరికి ఆకాశంలో ఎన్ని తారలున్నా ఒక్క మెరుపుతిగాకోసమే వేచియున్ననేమోనని అనిపించింది........
కవిత్వంలో పెద్ద టచ్ లేకపొయిన ఒక్క కవితయిన రాయాలనిపించింది......
అప్పుడే అనిపించింది నాకు బ్రెయిన్ దోబ్బిందని అందుకే రాయడం ఆపలనిపించింది........ :)
ఇట్లు
మీ బాలభీముడు

No comments:
Post a Comment